![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -441 లో..... పారిజాతాన్ని బయటకు గెంటిస్తానని పారిజాతంతో కార్తీక్ ఛాలెంజ్ చేస్తాడు. పారిజాతాన్ని కార్తీక్ రెచ్చగొడతాడు. నువ్వు నన్ను తక్కువ అంచనా వేసావ్ రా.. మీ నాన్నని ఫోన్ చేసి పెళ్లికి రాకని చెప్పానని పారిజాతం తన తప్పులు అన్ని గర్వంగా చెప్తుంటే వెనకాల నుండి శివన్నారాయణ వచ్చి అన్నీ వింటాడు. ఆ తర్వాత బయటకు గెంటేస్తాడు.
ఏమైంది అండి నన్ను ఎందుకు నెట్టారని పారిజాతం అడుగుతుంది. నీ మాటలు అన్ని ఇప్పటివరకు నేను విన్నానని శివన్నారాయణ అంటాడు. ఎలా విన్నారని పారిజాతం అడుగుతుంది. నేనే ఫోన్ చెసి వినిపించానని కార్తీక్ అనగానే అమ్మ దుర్మార్గుడా ఇంత మోసం చేస్తావురా అని కార్తీక్ పై కోప్పడతుంది పారిజాతం. అసలు నువ్వు వాళ్ళ నాన్నని పెళ్లి ఎందుకు వద్దన్నావ్ కారణం ఏంటని శివన్నారాయణ అడుగుతాడు దానికి పారిజాతం టెన్షన్ పడుతుంది. మా నాన్న నా పెళ్లికి వస్తున్నారని కార్తీక్ చెప్పగానే జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. ఈ పెళ్లి కచ్చితంగా జరుగుతుందని శివన్నారాయణ అందరికి చెప్తాడు. ఆ తర్వాత దాస్ ని కలుస్తుంది జ్యోత్స్న.
ఏంటి నాన్న నువ్వు ఆ దీపకి నిజం చెప్పావా.. నా మీద ఒట్టేసి చెప్పమని జ్యోత్స్న అడుగుతుంది. చెప్పానని దాస్ అనగానే.. ఇక అయిపోయింది అంతా అయిపోయిందని కోపంతో ఊగిపోతుంది జ్యోత్స్న. ఏం చెప్పలేదని మళ్ళీ దాస్ చెప్పడం తో జ్యోత్స్న నార్మల్ అవుతుంది. నువ్వు ఒకవేళ నిజం చెప్తే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఉహించలేవని దాస్ కి వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. మరొకవైపు శ్రీధర్ శివన్నారాయణ ఇంటికి వస్తాడు. నువ్వెందుకు వచ్చావ్ రా అని పారిజాతం అడుగుతుంది. నేనే కాదు మా బ్యాచ్ అంతా వచ్చామని శ్రీధర్ అనగానే అనసూయ, కాంచన, శౌర్య వెనకాల వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |